IND Vs WI : ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్న భారత్ ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం విదితమే. అందులో భాగంగానే విండీస్‌తో భారత్ మొత్తం 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ క్రమంలో మొదటి వన్డే మ్యాచ్ శుక్రవారం జరగనుంది. ఇక ఈ సిరీస్‌ను టీవీలో, ఆన్ లైన్‌లో ఏ విధంగా చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌లను టీవీలో అయితే డీడీ స్పోర్ట్స్‌లో చూడవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో అయితే ఫ్యాన్ కోడ్ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. అందులో ఈ మ్యాచ్‌లన్నింటినీ చూడవచ్చు. అయితే ఈ యాప్‌లో మ్యాచ్‌లను చూడాలంటే అందుకు సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్యాన్ కోడ్ యాప్ లో ప్రస్తుతం వివిధ రకాల సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తున్నారు. రూ.99 చెల్లిస్తే ఇండియా.. వెస్టిండీస్‌తో ఆడే 3 వన్డేలు, 5 టీ20లను చూడవచ్చు. దీంతో సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. దీన్నే ఫ్యాన్ కోడ్ యాప్‌లో టూర్ పాస్‌గా అందిస్తున్నారు.
ఇక ఫ్యాన్ కోడ్ యాప్‌లో యాడ్స్ లేకుండా మ్యాచ్‌లను చూడాలంటే అందుకు టూర్ పాస్‌ను రూ.169తో తీసుకోవాల్సి ఉంటుంది. లేదా రూ.199 నెలవారీ చందా చెల్లిస్తే కేవలం ఇండియా – విండీస్ మ్యాచ్‌లే కాకుండా ఇతర మ్యాచ్‌లను కూడా లైవ్‌లో చూడవచ్చు. అలాగే దీనికి ఏడాది రుసుము అయితే రూ.699 అవుతుంది. ఇలా ఫ్యాన్ కోడ్ యాప్‌లో నిర్దిష్టమైన చందాను చెల్లించి మ్యాచ్‌లను లైవ్‌లో చూడవచ్చు.
అయితే ఆన్‌లైన్‌లోనే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అది జియో టీవీ ఉన్నవారికి వస్తుంది. జియో సిమ్‌ను వాడేవారు జియో టీవీ యాప్‌లో డీడీ స్పోర్ట్స్‌ను వీక్షించవచ్చు. ఇలా భారత్, వెస్టిండీస్ మ్యాచ్ లను లైవ్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…