Indian Passport : ప్రపంచ దేశాలకు చెందిన పాస్‌పోర్టులకు ర్యాంకులు ఇచ్చే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ సంస్థ తాజాగా మరోమారు ఆయా దేశాలకు చెందిన పాస్ పోర్టులకు ర్యాంకులను ప్రకటించింది. ఈ క్రమంలోనే జపాన్ పాస్‌పోర్టు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైందిగా ఆ సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం జపాన్ తరువాత రెండో స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియా నిలిచాయి. జపాన్ పాస్‌పోర్టు ఉన్నవారు ఏకంగా 193 దేశాలకు వీసా లేకుండానే వెళ్లవచ్చు. అదే సింగపూర్, దక్షిణ కొరియా అయితే 192 దేశాలకు వెళ్లవచ్చు. ఇక ఈ జాబితాలో భారత్ 90వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే భారత పాస్ పోర్ట్‌తో 80 దేశాలకు వీసా అవసరం లేకుండానే వెళ్లవచ్చు. ఇక ఆయా దేశాల జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం.
భారత పాస్‌పోర్ట్‌తో ఓషియానాలోని.. కుక్ ఐలాండ్స్, ఫిజి, మార్షల్ ఐలాండ్స్, మైక్రోనిషియా, నైయూ, పలౌ ఐలాండ్స్, సమోవా, తువలు, వనౌటు.. తదితర దేశాలకు వెళ్లవచ్చు. అలాగే మధ్య తూర్పు ఆసియాలోని ఇరాన్, జోర్డాన్, ఓమన్, ఖతార్‌లకు, యూరోప్‌లోని అల్బేనియా, సెర్బియాకు, కరేబియన్ ప్రాంతంలోని బార్బడోస్, ది బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, డొమినికా, గ్రెనాడా, హైతీ, జమైకా, మాంటెస్రాట్, సెయింట్ కిట్స్ అండ్ నీవియా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ట్రినిడాడ్ అండ్ టోబాగోలకు వెళ్లవచ్చు.
ఆసియాలోని భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మకావ్, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్, టైమోర్ లెస్టెలతోపాటు.. అమెరికాలోని బొలివియా, ఎల్ సాల్వెడార్‌లకు కూడా వీసా లేకుండా వెళ్లవచ్చు. అలాగే ఆఫ్రికాలోని బోట్స్‌వానా, బురుండి, కేప్ వెర్డె ఐలాండ్స్, కొమొరో ఐలాండ్స్, ఇథియోపియా, గాబన్, గినియా – బిసౌ, మడగాస్కర్, మారిటేనియా, మారిషస్, మొజాంబిక్, ర్వాండా, సెనెగల్, సైకిలిస్, సియార్రా లియోన్, సోమాలియా, టాంజానియా, టోగో, టునిషియా, ఉగాండా, జింబాబ్వే.. తదితర దేశాలకు కూడా భారత పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండానే వెళ్లవచ్చు. అయితే వీటిల్లో కొన్నింటికి వీసా అసలు అవసరమే లేదు. కానీ కొన్నింటికి మాత్రం ఆయా దేశాలకు వెళ్లగానే ఎయిర్ పోర్ట్‌లో అక్కడిక్కడే వీసా ఇస్తారు. దీన్నే వీసా ఆన్ అరైవల్ అంటారు. ఇందుకుగాను ముందుగా వీసా తీసుకోవాల్సిన పనిలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…