Bandla Ganesh : నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. నిజంగానే ఈయన వ్యవహార శైలి అంతుబట్టదు. ఎప్పుడు ఏం మాట్లాడుతారో.. ఏం చేస్తారో.. ఎవరికీ తెలియదు. ఉన్నట్లుండి సడెన్‌గా ఏదో అనేస్తారు. అలాగే ఆయన ట్వీట్లు కూడా అర్థం లేకుండా ఉంటాయి. దీంతో అసలు ఆయన ఏం చెబుతున్నారు.. అనే విషయం చాలా మందికి అర్థం కాదు. అంతా కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేస్తారు. అలా ఆయన మళ్లీ ఇంకో ట్వీట్ చేశారు. వాస్తవానికి ఆయన చేసిన ట్వీట్ సరిగ్గానే ఉంది. కానీ ఆయన ఎవరినుద్దేశించి అలా పోస్ట్ పెట్టారు.. అన్నది మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బండ్ల గణేష్ తాజాగా మరోమారు వార్తల్లో నిలిచారు. ఆయన ఓ ట్వీట్ పెట్టి సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెర లేపారు. తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, ఎన్‌టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబుల మాదిరిగా టాలెంట్ కూడా ఉండాలి.. అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారు.. అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. ఆయన ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ లిస్ట్‌లో అందరికీ తండ్రులు, తాతలు ఉన్నారు. మరి ఆయన ఇంకెవరిని ఉద్దేశించి అలా అన్నారు.. అని చర్చించుకుంటున్నారు.
కొందరైతే అల్లు అర్జున్ గురించి కామెంట్స్ చేశారని అంటుండగా.. కొందరు మాత్రం బండ్ల గణేష్.. విజయ్ దేవరకొండ గురించి కామెంట్లు చేశారని అంటున్నారు. ఈ మధ్య పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ నటించిన చోర్ బజార్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన బండ్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డైలాగ్స్ రాని స్టార్స్‌ను హీరోలను చేశావ్, నీ కొడుకు ఫంక్షన్‌కు నువ్వు రావా.. అని పూరీని బండ్ల ప్రశ్నించారు. అలాగే చార్మితో తిరుగుతూ భార్యను నిర్లక్ష్యం చేస్తున్నావని ఇన్‌డైరెక్ట్‌గా పూరీపై బండ్ల కామెంట్లు చేశారు. దీంతో పూరీ, చార్మి తదితరులు కల్పించుకుని బండ్లకు కూడా ఇన్‌డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చారు. అయితే విజయ్ దేవరకొండ అంటే నచ్చదని.. ఆయనను ఉద్దేశించే బండ్ల ఇలా అని ఉండవచ్చని అంటున్నారు. కానీ విజయ్ కి గాడ్ ఫాదర్ లా తాతలు, తండ్రులు లేరు. మరి బండ్ల ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు.. అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. దీనిపై ఆయనే మళ్లీ ఏమైనా మాట్లాడుతారేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…