Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండేల కాంబినేషన్‌లో వస్తున్న మూవీ.. లైగర్. ఈ మూవీకి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ కానున్న ఈ మూవీకి గాను తాజాగా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. లైగర్ టైటిల్ ట్రాక్ మీద సాగే ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో విజయ్ తన విశ్వరూపం చూపించాడు. మాస్ కా బాప్ అనిపించుకున్నాడు. ఇందులో విజయ్ బాక్సింగ్ చాంపియన్‌గా నటిస్తున్నాడు. మరో కీలకపాత్రలో రమ్యకృష్ణతోపాటు అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా నటించారు.
కాగా లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మొదట హైదరాబాద్‌లో నిర్వహించి అనంతరం చిత్ర యూనిట్ ముంబైకి వెళ్లింది. అక్కడ కూడా ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దీనికి పూరీ సొంత బ్యానర్ పూరీ కనెక్ట్స్‌తోపాటు కరణ్ జోహార్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఇక ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్ సింపుల్ లుక్‌లో దర్శనమిచ్చాడు. అయితే అంతటి స్టార్ అయిన విజయ్ ఆ ఈవెంట్‌కు రూ.199 ధర కలిగిన స్లిప్పర్లను ధరించి వచ్చాడు. దీంతో అందరి చూపు ఆ స్లిప్పర్లపై పడింది. విజయ్ ఎందుకు అలా చీప్ ధర కలిగిన చెప్పులను ధరించి వచ్చాడు.. అని అంతటా చర్చ నడుస్తోంది. అయితే ఇందుకు ఆయన స్టైలిస్ట్ హర్మాన్ మాట్లాడుతూ.. విజయ్ అసలు ఎందుకు స్లిప్పర్స్‌ను ధరించాడో చెప్పారు.

విజయ్ దేవరకొండకు సొంత దుస్తుల డిజైన్ స్టూడియో ఉంది. ఆ బ్రాండ్ పేరిట దుస్తులను కూడా విక్రయిస్తున్నాడు. అయితే విజయ్ ధరించే దుస్తులను సహజంగానే చాలా మంది చూస్తుంటారు. ఆయన ఏ కంపెనీకి చెందిన దుస్తులను, షూస్‌ను, వాచ్‌లను, కళ్లద్దాలను, క్యాప్‌లను ధరిస్తున్నాడో.. వాటినే ఆయన ఫ్యాన్స్ కొని ధరించాలని చూస్తుంటారు. అయితే ఆయన పలు బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ధరిస్తే వాటికి ప్రమోషన్, ఫ్రీ పబ్లిసిటీ చేసినట్లు అవుతుంది. ఇది విజయ్‌కు నష్టం కలిగిస్తుంది. ముందస్తుగా అగ్రిమెంట్ చేసుకుని ఆ బ్రాండ్‌కు చెందిన దుస్తులను ధరిస్తే ఓకే. ఎలాగూ పెయిడ్ పబ్లిసిటీ కనుక ఏమీ కాదు. కానీ ఏ బ్రాండ్ ఉత్పత్తులను పడితే వాటిని ధరిస్తే.. వాటికి ఉచితంగా ప్రమోషన్ చేసినట్లు అవుతుంది. దీంతో నష్టమే కలుగుతుంది. కనుకనే విజయ్ సింపుల్‌గా అలా స్లిప్పర్స్‌తో వచ్చాడని చెప్పారు. కాగా లైగర్ మూవీ ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది.