Urfi Javed : బాలీవుడ్ నటి ఉర్ఫి జావేద్ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె బిగ్ బాస్ ద్వారా మరింత ఫేమస్ అయింది. సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఇక ఈమె వైవిధ్యభరితమైన దుస్తులను ధరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తుంటారు కూడా. అయినప్పటికీ వాటినేమీ ఈమె పట్టించుకోదు. తన పని తాను చేసుకుపోతుంటుంది.

ఇక ఉర్ఫి జావేద్ తాజాగా బీచ్ దగ్గర బికినీ కనిపించి సందడి చేసింది. ఈమెకు బికినీలు వేయడం కొత్త కాదు. కానీ ఈసారి వేసిన బికినీ మాత్రం చాలా వెరైటీగా ఉంది. పైన ఆల్చిప్పలతో ఛాతిని కప్పేసింది. ఇక కింది భాగంలో మొత్తం కనిపించేలా ఉన్న లో దుస్తులను ధరించింది. దీంతో ఒకసారి చూస్తే కింద ఆమె ఏమీ వేసుకోలేదు కాబోలు.. అనిపిస్తుంది. కానీ శరీరం కలర్‌తో ఉన్న అండర్ గార్మెంట్‌ను ధరించినట్లు ఉర్ఫి చెప్పింది.
View this post on Instagram
ఇక ఉర్ఫి జావేద్ షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సాధారణంగానే ఈ అమ్మడు అందాల ఆరబోత డ్రెస్సులు ధరిస్తుంటుంది. ఇక బీచ్ కనిపిస్తే చాలు.. బికినీలు ధరించి రెచ్చిపోతుంది. అందులో భాగంగానే తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోలో ఆమె అందాలు మతులు పోగొట్టేలా ఉన్నాయి. కుర్రకారు ఆమెను చూసి హీటెక్కిపోతున్నారు.