Mumtaj : నటి ముంతాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈమె తెలుగుతోపాటు తమిళంలోనూ ఎన్నో మూవీల్లో నటించి అలరించింది. పవన్ కల్యాణ్ ఖుషి మూవీలో ఈమె ప్రత్యేక పాత్రలో నటించింది. అలాగే అప్పట్లో వెంకటేష్ నటించిన జెమిని సినిమాలో టైటిల్ సాంగ్‌లో మెరిసింది. అలాగే మహేష్ బాబు ఆగడు సినిమాలో విలన్ సోనూసూద్‌కు జోడీగా నటించింది. అలాగే అడపా దడపా ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తోంది. అయితే ఈ అమ్మడు తాజాగా చిక్కుల్లో పడింది. ఈమెపై ఒక విషయంలో కేసు నమోదైంది.

ముంతాజ్ చెన్నైలోని అన్నానగర్‌లో నివాసం ఉంటోంది. ఈమె ఉత్తరాదికి చెందిన ఇద్దరు బాలికలను పనిలో పెట్టుకుంది. వారు మైనర్లు. సరైన వయస్సు లేకుండా వారిని బాల కార్మికులుగా ఆమె పనిలో పెట్టుకుంది. పైగా వారిని పని చేయాల్సిందిగా ఆమె చిత్ర హింసలు పెడుతున్నదట. దీంతోపాటు వారిని అసభ్య పదజాలంతో దూషిస్తోందట. దీంతో ఆ ఇద్దరు బాలికల్లో ఒకామె ఎలాగో బయట పడి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ముంతాజ్ పై కేసు నమోదు చేవారు. ఈ క్రమంలోనే ఆ బాలికలను పోలీసులు బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే ముంతాజ్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ముంతాజ్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈమె చివరిసారిగా వలయం అనే తమిళ సినిమాలో నటించింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలో విడుదల కానుంది. గతంలో ఈమె బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేసింది.