Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య ఈమె చేస్తున్న గ్లామర్ షో అంతా ఇంతా కాదు. ఇటీవలే ఓ మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం ఈమె చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. ఇలా తరచూ ఏదో ఒక ఫొటోషూట్ చేసిన ఫొటోలను పెడుతున్న సమంత ఉన్నట్లుండి షాకిచ్చింది. బాత్‌రూమ్‌లో టవల్‌ను అడ్డుగా పెట్టుకుని దర్శనమిచ్చింది. అంతేకాదు.. త్వరగా రావాలంటూ ఆహ్వానం పలుకుతోంది. ఇంతకీ ఆమె పెట్టిన పోస్టు ఎవరిని ఉద్దేశించి..? అంటే..

సమంత హెయిర్ స్టైలిస్ట్ నీరజ కోన అన్న విషయం తెలిసిందే. ప్రీతమ్ జుకల్కర్ ఎలాగైతే సమంతకు డ్రెస్ స్టైలిస్ట్‌గా ఉన్నాడో.. అలాగే ఈమె కూడా సమంతకు హెయిర్ స్టైలిస్ట్‌గా ఉంది. ఈమె, ప్రీతమ్, సమంత ముగ్గురూ కలసి ఈ మధ్య పదే పదే వెకేషన్స్‌కు కూడా వెళ్లారు. అయితే నీరజ కోన ఇటీవల వేరే ప్రదేశానికి వెళ్లింది. ఆమె వెకేషన్‌కో.. ఇంకో చోటికో.. తెలియదు కానీ.. ఆమె అక్కడ ఉండి సమంతకు ఒక నోట్ పెట్టింది.
పాపా.. ఐ లవ్ యూ. మీరు అద్భుతంగా ఉన్నారు.. అది గుర్తుంచుకోండి.. అంటూ నీరజ కోన సమంతకు లేఖ రాసింది. దీనికి సమంత రిప్లై ఇచ్చింది. అయ్యో.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, త్వరగా తిరిగి రండి.. నాకు నోట్ పెట్టినందుకు థ్యాంక్స్.. అని సమంత ఆమెకు రిప్లై ఇచ్చింది. దీంతో సమంత పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే సమంత ఈ నోట్స్‌తోపాటు తన బాత్ టవల్ ఫొటోను కూడా షేర్ చేసింది. అందులో ఆమె ఫొటో మసకగా ఉంది. తాను బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకుని దాన్ని ఎడిట్ చేసి వాటిపై నోట్స్ ఉంచి ఆ తరువాత ఆ ఫొటోను సమంత తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసినట్లు స్పష్టమవుతోంది. దీంతో సమంత మరోమారు గ్లామర్ షో చేసి అలరిస్తోంది. ఈ ఫొటో చూస్తుంటే కుర్రకారు గుండెల్లో గుబులు పుడుతోంది.
ఇక సమంత ఈ మధ్య పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన కణ్మణి రాంబో ఖతీజా ఈ మధ్యే విడుదల కాగా.. ఈ సినిమా వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు. కానీ తమిళంలో ఇదే మూవీని కాతువాకుల రెండు కాదల్ పేరిట రిలీజ్ చేయగా.. అక్కడ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక సమంత నటించిన యశోద అనే సైన్స్ ఫిక్షన్ మూవీ గ్లింప్స్‌ను ఈ మధ్యే రిలీజ్ చేశారు. అందులో సమంత స్టన్నింగ్ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇక యశోద మూవీ ఆగస్టులో రిలీజ్ కానుంది.