Thyroid Foods : ప్రస్తుతకాలంలో మారుతున్న జీవన శైలిని బట్టి నూటికి ఎనభై శాతం మంది థైరాయిడ్ గ్రంథి సమస్యకు లోనవుతున్నారు. థైరాయిడ్ గ్రంథి అనేది గొంతు ప్రాంతంలో ఉంటుంది. ఇది చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. కానీ ఈ చిన్న పరిమాణంలో ఉండే థైరాయిడ్ గ్రంథి హార్మోనులను విడుదల చేస్తూ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అనేక వ్యాధుల నుండి రక్షించడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి ఎక్కువగా పని చేస్తే హైపర్ థైరాయిడిజం అని, చాలా నెమ్మదిగా పని చేస్తే హైపో థైరాయిడిజం అని అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ శరీరంలో అవాంతరాలు తలెత్తుతాయి. ఎప్పుడైతే మనకు థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయదో మన శరీరంలో అనేక మార్పులు ఎదురవటం జరుగుతుంది.
అందువల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని ఆహార నియమాలు పాటించడం ఎంతో ఉత్తమం. థైరాయిడ్ ఉన్నవారికి నీరసం, అలసట, ఒత్తిడి, మైకం వంటి సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ ను నియంత్రణలో ఉంచేందుకు ఐరన్, మెగ్నిషియం, జింక్, అయోడిన్, విటమిన్ బి, సి, డి, సెలీనియం వంటి పోషకాలు చాలా అవసరం. ఈ పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకుంటే థైరాయిడ్ నియంత్రణలోకి వస్తుంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు పెసలను రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. పెసలను నానబెట్టి మొలకలుగా తీసుకుంటే మీ శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. పెసలలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల త్వరగా జీర్ణం అవుతాయి. అలాగే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, మినరల్స్ వంటివి పుష్కలంగా అందడంతోపాటు థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారికి మలబద్దకం సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి పెసలను నిత్యం ఆహారంలో తీసుకోవడం ద్వారా మలబద్దకం సమస్య దూరమవుతుంది. థైరాయిడ్ సమస్య అదుపులో ఉండాలంటే శరీరానికి అవసరమైనంత నీరు, తగినంత నిద్ర ఎంతో అవసరం. అదేవిధంగా రోజుకి అరగంట వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…