Charmy Kaur : ఈ ఆగస్టు 25న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది లైగర్. హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రధాన పాత్రాల్లో నటించారు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ మూవీని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించగా.. ఛార్మి, దర్శకుడు పూరీ, బాలీవుడ్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైన బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
మొదటి రోజునే రూ.200 కోట్లు వసూలు చేస్తుందని సినిమా యూనిట్ చేసిన ప్రచారం కేవలం కలగానే మిగిలిపోయింది. లైగర్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంత డిజాస్టర్ టాక్ తో దారుణమైన నెగెటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో పూరీని ఏకేస్తున్నారు. లైగర్ చిత్రం పరాజయంతో పూరీ జగన్నాథ్ పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా పూరీపై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నందుకు ఛార్మి కూడా నిండా మునిగింది అనే వార్తలు తీవ్రంగా ప్రచారం అవుతున్నాయి.
లైగర్ చిత్రం విడుదలైన మొదటి షోకే ఫలితం తెలియడంతో ఛార్మి తన సన్నిహితుల దగ్గర చాలా ఎమోషనల్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 20 ఏళ్లు కష్టపడి కూడబెట్టుకున్న 200 కోట్ల రూపాయలు ఒక్కసారిగా లైగర్ చిత్రంతో నష్టపోయాను అని సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడటం జరిగిందట ఛార్మి. అంతే కాకుండా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రాబోతున్న జనగణమన చిత్రానికి కూడా ఛార్మి నిర్మాణ బాధ్యతలు వహిస్తోంది. లైగర్ చిత్రం డిజాస్టర్ తో ఈ ప్రభావం కాస్త జనగణమన చిత్రంపై పడే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనితో ఛార్మి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…