Samantha : కొంత కాలం క్రితం తెలుగు హీరోయిన్లలో సమంత టాప్ పొజిసన్ లో ఉండేది. కానీ నాగ చైతన్యతో వివాహం తరువాత తనకు నెమ్మదిగా సినిమా అవకాశాలు రావడం తగ్గిపోయింది. పెళ్లి తరువాత ఈమె చాలా పెద్ద సినిమాలను చేజార్చుకుందని సమాచారం. కానీ తను విడాకులు తీసుకున్న దగ్గరి నుండి మళ్లీ మునుపటి లా సినిమాలు చేయడం మొదలు పెట్టింది. హాట్ ఫోటో షూట్ లతో వేగంగా సినిమాలు ఒప్పుకుంటూ దూకుడు పెంచిందనే చెప్పవచ్చు. అంతే కాకుండా పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటం సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈమెకు దేశవ్యాప్త గుర్తింపు లభించింది. దాంతో బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు రావడం మొదలైంది.
పుష్ప ఐటం సాంగ్ తో ఎక్స్ పోజింగ్ హద్దులు చెరిపేసిన సమంత కోసం తెలుగు నిర్మాతలు క్యూ కడతారని భావించినప్పటికీ అలా జరగడం లేదు. దానికి కారణం సమంత రెమ్యునరేషన్ భారీగా పెంచడమే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిజానికి పుష్ప సినిమాలోని ఊ అంటావా పాట ద్వారా సమంతకి వచ్చిన క్రేజ్ చూసిన దర్శకుడు కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో తాను తీయబోయే తదుపరి సినిమాలో చేయడానికి అడిగినట్లు సమాచారం. కానీ సమంత ఈ ఆఫర్ ను తిరస్కరించిందని తెలిసింది.
అయితే కొరటాల శివ తాను చేయబోయే జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం సమంతకి రూ.2.50 కోట్ల పారితోషికం కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారట. కానీ సమంత రూ.4 కోట్లు డిమాండ్ చేసిందని చెబుతున్నారు. అంతకంటే తక్కువ అయితే చేసేది లేదని తేల్చి చెప్పిందట. కానీ నిర్మాతలు అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి ఒప్పకోకపోవడంతో సమంత ఈ ఆఫర్ ను వదులుకుందని సమాచారం. దాంతో మంచి అవకాశాన్ని చేజార్చుకుందని సినీ వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…