Anasuya : ఆంటీ.. ఆంటీ.. ఆంటీ.. ట్విటర్‌లో ఎక్కడ చూసినా ఇదే పదం కనిపిస్తోంది. ఆంటీ అని పిలవడం ఏజ్ షేమింగ్ అని అనసూయ మండిపోతుంటే.. మేము మాత్రం ఆంటీ అని పిలవడం మానేదే లేదని మరింత రెచ్చిపోతున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళ్తే.. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో స్టార్ యాంకర్ అనసూయ అమ్మను అంటే ఆ ఉసురు ఊరికే పోదు అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేసింది. ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన ట్వీట్ అని ఫ్యాన్స్ అనసూయను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
ఇంకొందరై బూతులు తిట్టారు. ఈ క్రమంలో కొందరు అనసూయను అంటీ అని సంబోధించారు. దీనిపై అనసూయ ఫైర్ అయ్యింది. తనను ఆంటీ అంటూ వయసు ఆధారంగా టార్గెట్ చేస్తున్నారని, అలా అన్న వారిపై కేసు పెడతానంటూ సీరియస్ అయ్యింది అనసూయ. దీంతో ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి సదరు ఫ్యాన్స్ మరింతగా ట్రెండ్ చేయటం ప్రారంభించారు. మరోవైపు అనసూయ ఏమాత్రం తక్కువ తినలేదు. తనను ట్విట్టర్ వేదికగా విమర్శించిన వారికి అంతే గట్టిగా సమాధానం ఇస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో ఆంటీ అనే పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. కాగా.. ఈ వివాదంలోకి శ్రద్దా దాస్ ఎంటరవుతూ అనసూయకు సపోర్టిచ్చింది. నీకంటే సగం వయసున్న అమ్మాయిల కంటే కూడా నువ్వే చాలా అందంగా ఉంటావు. నీకంటే రెట్టింపు వయసున్న అంకుల్స్ కన్నా కూడా నువ్వే హాట్‌గా కనిపిస్తావు. ఎల్లప్పుడూ నీకు అభిమానినే అని రాసుకొచ్చింది.
అయితే తనపై అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేస్తున్నవారిపై అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ అనసూయ కంప్లెయింట్ ఇచ్చిందనే అంటున్నారు. ఇక దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…