Viral Video : అక్ర‌మ సంబంధం పెట్టుకుని వ‌దిలివెళ్లిపోయిన భార్య‌.. బిడ్డ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్న రిక్షావాలా..

Viral Video : రోజురోజుకూ మానవసంబంధాల విలువలు తగ్గిపోతున్నాయి. వివాహ బంధానికి విలువ లేకుండా పోతోంది. భార్య లేదా భర్త చెడు ఆలోచనలతో పక్కదోవ పడిపోతున్నారు. అనవసరమైన కారణాలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. టెక్నాలజీతోపాటు రోజురోజుకూ మనుషుల తీరులో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమం వాడుక ఎక్కువవడంతో ప్రతి విషయం నిమిషాల్లో అందరి దృష్టిలోనూ పడుతోంది. తాజాగా ఓ బాధ్యతగల తండ్రి వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెటిజన్ల‌ దృష్టిలోకి వచ్చింది. ఈ వీడియో చూసి అంద‌రూ తెగ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా తండ్రిగా తన బాధ్యతను వదులుకోలేదు అంటూ ఆ రిక్షావాలాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అసలు వివరాల్లోకి వెళ్తే.. రాజేశ్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం బీహార్ నుంచి ఉపాధి కోసం మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌కు వచ్చి అక్కడే ఉంటూ రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే సియోనీ జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఇద్దరు సంతానం కూడా కలిగారు. అయితే రాజేష్ భార్య కొన్ని నెలల క్రితం వేరే వ్యక్తి మోజులోపడి కడుపున పుట్టిన బిడ్డలను కాదనుకొని అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తితో వెళ్ళిపోయింది. భార్య వదిలి వెళ్ళిపోవడంతో తన బిడ్డలు అనాథలు  కాకూడదని వారిని రాజేశ్ అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు.

Viral Video

కూతురికి మూడు సంవత్సరాల వయస్సు ఉండటంతో ఆమెను ఇంటి దగ్గరే వదిలి, ఏడాది కొడుకుని తన భుజంపై వేసుకుని రిక్షా తొక్కుతూ కష్టపడుతున్నాడు. రిక్షా తొక్కుతూ వచ్చిన డబ్బుతో పిల్లల‌ను పోషిస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నన్ను నా బిడ్డలను మరో యువకుడి కోసం అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయిన అలాంటి భార్య నాకు వద్దు. నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని రాజేశ్ కోరుకుంటున్నాడు. అతడు రిక్షా తొక్కుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share
Mounika

Recent Posts

Summer Health Tips : ఎండ‌లో తిరిగి ఇంటికి వ‌చ్చారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Summer Health Tips : మే నెల సగానికి పైగా గడిచినా వేసవి తాపం కూడా త‌గ్గ‌డం లేదు. ఎంతో…

Sunday, 19 May 2024, 7:06 PM

Rs 200 Notes : రూ.200 నోట్లు తీసుకుంటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Rs 200 Notes : కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వం చాలా ఏళ్ల కింద‌ట రూ.500, రూ.1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన…

Sunday, 19 May 2024, 4:56 PM

Fruits In Fridge : ఈ పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ మీరు ఫ్రిజ్‌లో పెట్ట‌వ‌ద్దు..!

Fruits In Fridge : వేసవి కాలం ప్రారంభం కాగానే చాలా మంది ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం ప్రారంభిస్తారు,…

Sunday, 19 May 2024, 11:06 AM

How To Increase Breast Milk : ఈ ఆహారాల‌ను తింటే చాలు.. బాలింత‌ల్లో స‌హ‌జ‌సిద్ధంగా పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి..!

How To Increase Breast Milk : గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న సంగ‌తి తెలిసిందే. కాస్త…

Saturday, 18 May 2024, 8:47 PM

Telugu OTT : ఈ వారం ఓటీటీల్లో 7 సినిమాలు.. వాటిల్లో 4 బాగా స్పెష‌ల్‌.. స్ట్రీమింగ్ వేటిలో అంటే..?

Telugu OTT : వారం వారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో…

Saturday, 18 May 2024, 6:18 PM

Eggs In Summer : వేస‌విలో కోడిగుడ్ల‌ను తిన‌డం మంచిది కాదా..?

Eggs In Summer : గుడ్డు ఒక ఆరోగ్యకరమైన మరియు సూపర్ ఫుడ్. ఎందుకంటే విటమిన్ బి12, బి6, బి5,…

Saturday, 18 May 2024, 11:42 AM

Lemon Buying : నిమ్మ‌కాయ‌ల‌ను కొంటున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Lemon Buying : నిమ్మకాయల‌ను భారతీయులు ఇంట్లో మరియు వంటగదిలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. రుచిలో పుల్లగా ఉండే నిమ్మకాయలు…

Saturday, 18 May 2024, 9:04 AM

Hibiscus Tea : మందార పువ్వుల టీని రోజూ తాగితే.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Hibiscus Tea : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు క‌నిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని అంద‌మైన పుష్పాలు పూస్తాయి.…

Friday, 17 May 2024, 7:53 PM