Akhanda Movie : నట సింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ తర్వాత వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. సినిమా రిలీజ్ కి ముందే జై బాలయ్య పాట హిట్ కావడం, ట్రైలర్‌లో కూడా బాలయ్య మార్కు ఉండడంతో అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే అందరి అంచనాలను మూవీ రీచ్ అయ్యింది. థమన్ బాక్ గ్రౌండ్ స్కోర్ మూవీకి హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య అఖండ, రామకృష్ణ అనే డ్యూయల్ రోల్ ప్లే చేశారు. బాలయ్య యాక్షన్ సీన్స్ లో ఇరగదీశాడు. అఖండ సినిమాతో చాలా కాలం తరువాత నటుడు శ్రీకాంత్ మరలా విలన్ గా పరిచయం అయ్యాడు. శ్రీకాంత్ నటన కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీలో నటి నవీన రెడ్డి కీలక పాత్రలో నటించింది. నవీనా రెడ్డి స్క్రీన్ పై కనిపించింది తక్కువసేపు అయినా కీ రోల్ పోషించింది. నవీన రెడ్డి ఇంతకు ముందు ఎఫ్ 2 సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో నటించింది. అలాగే వెంకీ మామ, అతిథి దేవోభవ, హిట్, డియర్ మేఘన, చేరువైన దూరమైన వంటి చిత్రాల్లో నటించింది నవీన రెడ్డి. అయితే ఈ సినిమాలతో రాని గుర్తింపు నవీన రెడ్డికి అఖండతో వచ్చిందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా నవీన రెడ్డి పక్కా హైదరాబాదీ కాగా ఆమెకు మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం. చిరు కరోనా బారిన పడిన సమయంలో నవీన రెడ్డి ఆయన కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేయడం విశేషం. నవీన ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాల అప్డేట్ లు ఇస్తూ ఉంటుంది. అలాగే ఆ మధ్య రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో కూడా పాల్గొంది నవీన రెడ్డి. అఖండ విజయంతో ఈ అమ్మడు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…