ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే సోమవారం మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్య వాణిని వినిపిస్తూ.. ఈ సారి భక్తులు చాలా కష్టాలు పడ్డారని, అయినప్పటికీ తనకు మొక్కులు చెల్లించారని అన్నారు.
భక్తులందరినీ తాను కాపాడుతానని, వారు సంతోషంగా ఉండే విధంగా చూస్తానని తెలిపారు. ప్రజలు పలు సమస్యల వల్ల ఇబ్బందులు పడుతుంటే రైతులు వర్షాల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారని, అయితే అందరినీ తాను రక్షిస్తానని తెలిపారు. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పనిలేదన్నారు. కరోనా భయ పెడుతున్నా ప్రజలు తనను నమ్మి తన మొక్కులు తీర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
అమ్మవారికి ఇంత చేస్తున్నాం, అయినా అమ్మవారు మనల్ని పట్టించుకోవడం లేదు.. అని ఎవరూ అనుకోకూడదని, అందరినీ కాపాడుతానని తెలిపారు. ప్రజల కష్టాలను తీరుస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణలతకు చీర, ఒడి బియ్యం సమర్పించారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…