ఆంధ్ర ప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) లో ఖాళీగా ఉన్నటువంటి 46 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్,టీజీటీ, కేర్ టేకర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 19 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిన్సిపల్ గ్రేడ్ -2 విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ.40,270-రూ.93,780 చెల్లించనున్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే విధంగా 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాంటి వారు మాత్రమే అర్హులు.
టీజీటీ విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ. 28,940-రూ.78,910 వరకు చెల్లించనున్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా టెట్ పేపర్-2 క్వాలిఫై అయి ఉండాలి.
కేర్ టేకర్/వార్డెన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.21,200 నుంచి రూ. 63,010 చెల్లించనున్నారు. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇప్పటికే ఈ ఉద్యోగానికి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు 2021 ఆగస్టు 19వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.https://welfarerecruitments.apcfss.in/
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…