అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజ్ కుంద్రా బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు కుంద్రాకు చెందిన విదేశీ కంపెనీల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు పలు వీడియో టేపులను స్వాధీనం చేసుకున్నారు.
కాగా విషయం ఇంతలా ఉంటే శిల్పాశెట్టి మాత్రం తన భర్తను వెనకేసుకొస్తుండడం విశేషం. తన భర్త అశ్లీల చిత్రాలు తీయలేదని, శృంగార సినిమాలను తీశారని, వాటికి, అశ్లీలానికి సంబంధం లేదని శిల్పాశెట్టి తెలిపింది. కాగా 120 అశ్లీల చిత్రాలను తీసేందుకు గాను కుంద్రా దాదాపుగా రూ. 9 కోట్లను ఖర్చు చేసినట్టు తెలిసింది.
ఇక రాజ్ కుంద్రాకి చెందిన వియన్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పదవి శిల్పా శెట్టి గతంలో రాజీనామా చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఆమె ఎందుకు రాజీనామా చేసింది ? అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రాజ్ కుంద్రా పోలీసుల కస్టడీలో ఉండగా, అతన్ని మరిన్ని రోజుల పాటు అదుపులో ఉంచుకుని అతని నుంచి మరిన్ని వివరాలను రాబట్టనున్నారు. అతనిపై మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఆ కోణంలోనూ పోలీసులు కేసును విచారించనున్నారు. అయితే ఇంత జరిగినా మరోవైపు శిల్పాశెట్టి మాత్రం తన భర్త అమాయకుడని, అతన్ని వెనకేసుకు వస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…