Tarakarama Theatre : ఎన్టీఆర్ ప్రేమతో కట్టించుకున్న ఆ థియేటర్.. చివరకు బూతు థియేటర్ గా ఎందుకు మిగిలింది..?

Tarakarama Theatre : నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగారు. తెలుగు వెండి తెర ఆరాధ్య దైవమయ్యారు. పౌరాణిక చిత్రాల్లో తిరుగులేని నటుడుగా ఎదిగారు. ఎన్టీఆర్ సినిమాలతోపాటు రాజకీయాలని కొంతకాలం ఏకచత్రాధిపత్యంగా ఏలారు. ఆయన సినిమాల్లో ఓ వెలుగు వెలుగుతున్న కాలంలోనే హైదరాబాద్ లో విలువైన ఆస్తులు సంపాదించారు. అలా ఆయన సంపాదించిన ఆస్తులలో చెప్పుకోదగ్గ ప్రాపర్టీ కాచిగూడలోని తారకరామ థియేటర్.

ఈ థియేటర్ కట్టకముందు కాచిగూడ చౌరస్తాలోని ఈ ప్లేస్ లో కొంతమంది పక్షులను వేటాడి జీవనం సాగిస్తుండేవారు. వారికి ఎంతోకొంత ముట్టజెప్పి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. అనంతరం అక్కడ తారకరామ అనే థియేటర్ ను నిర్మించారు. అక్బర్ సలీం అనార్కలీ సినిమాతో ఆ థియేటర్ ను ప్రారంభించాలని ఎన్టీఆర్ ఆశించారు.

Tarakarama Theatre

కానీ థియేటర్ కట్టడం ఆలస్యం అవడంతో ఆల్రెడీ ఆంధ్ర, సీడెడ్ లో ఆ చిత్రం విడుదలైంది. అక్కడ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత నైజాంలో విడుదల చేయగా అది కేవలం ఈ థియేటర్లో 22 రోజులు మాత్రమే ఆడి ఫ్లాప్ మూవీగా నిలిచింది. తెలుగు, హిందీ చిత్రాలను ఇక్కడ రిలీజ్ చేసినప్పటికీ అమితాబ్ నటించిన డాన్ చిత్రం ఎక్కువ రోజులు (525) ఆడి రికార్డు సృష్టించింది.

ఆ తర్వాత నాగార్జున గీతాంజలి 225 రోజులు, ఇంకొన్ని సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. కానీ 1991 లో రాజీవ్ గాంధీ హత్యానంతరం ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై జరిగిన దాడులలో ఈ థియేటర్ కొంతవరకు ధ్వంసం అయింది. దీంతో 1995లో మళ్ళీ పునరుద్ధరించారు. కానీ అప్పటికే తారకరామ‌ థియేటర్ వైభవాన్ని కోల్పోయింది. ఆ తర్వాత విడుదలైన ఏ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. క్రమంగా అది బి సెంటర్ థియేటర్ గా మారిపోయింది. చివరకు ఆంగ్ల, మలయాళ బూతు చిత్రాలు ప్రదర్శించేవారు.

ఆ తర్వాత ఏషియన్ వారు ఈ థియేటర్ ను లీజ్ కి తీసుకొని ఏషియన్ తారకరామా అని మల్టీప్లెక్స్ రూపంలో తీసుకొచ్చినప్పటికీ దానికి వచ్చిన ఇబ్బందులు తొలగలేదు. ఎంతో విశాలంగా అభివృద్ధి చేసినా కూడా ఆ థియేటర్లో ఎక్కువ రోజులు ఆడిన (73 రోజులు) మూవీ ఉరి ద సర్జికల్ స్ట్రైక్. మొత్తానికి ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న థియేటర్ చివరకు బి గ్రేడ్ థియేటర్ గా ఆ తర్వాత, అద్దె కూడా వసూలు చేయలేని థియేటర్ గా మిగిలిపోవడం బాధాకరమైన విష‌య‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM