Bigg Boss : తెలుగులో బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీవీ షో బిగ్ బాస్. తెలుగు తెరపై ఈ షో సాధించిన టీఆర్పీ రేటింగ్స్ ను వేరే ఏ ఇతర షో కూడా సాధించలేకపోయింది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ షోకి అభిమానులుగా మారిపోయారు. కానీ ఇంతగా ప్రాచుర్యం పొందిన ఈ షో లో గెలుపొందిన వారికి మాత్రం ఆ తరువాత కెరీర్ లో కలసిరావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. షోలో గెలుపొంది బయటకు రాగానే హడావిడి చేయడం, ఎడాపెడా సినిమాలు, టీవీ షోలు చేయబోతున్నట్టుగా ప్రకటించడం ఆ తరువాత కనుమరుగైపోవడం అలవాటుగా మారిపోయింది.
అయితే ఇలా జరగడం అనేది బిగ్ బాస్ సీజన్ 2 లో గెలుపొందిన కౌశల్ తో మొదలైంది. ఈయన ఎన్నో వివాదాలు, హంగూ, ఆర్భాటాల మధ్య బిగ్ బాస్ లో గెలుపొంది రాగానే అనేక సినిమాలు చేయనున్నట్టు వెల్లడించాడు. వాటిలో చాలా వరకు విడుదల కూడా కాలేదు, కొన్ని విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల దృష్టికి రాకుండానే పోయాయి. దాదాపు బిగ్ బాస్ విన్నర్స్ అందరూ ఇదే పరిస్థితిని చవిచూశారు.
ఆ తరువాత సీజన్ 4 లో విన్నర్ గా నిలిచిన అభిజీత్, సీజన్ 5 లో విజేత అయిన వీజే సన్నీల విషయంలో కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇక వీజే సన్నీ కూడా బిగ్ బాస్ లో గెలుపొంది బయటకు రాగానే కొన్ని ప్రాజెక్టులు చేశాడు. కానీ వాటిలో ఏవీ విడుదలకు నోచుకోలేదు. ఇంకా ఇదే సీజన్ 5 లో రన్నరప్ గా నిలిచిన యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కూడా చాలా కాలం ఎదురు చూపుల తరువాత ఆహా ఓటీటీ ద్వారా ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే వెబ్ సిరీస్ తో పలకరించాడు. కానీ అతనికి అది ఆశించినంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే దీప్తి సునయనతో తన బ్రేకప్ టాపిక్ మాత్రం ఈ వెబ్ సిరీస్ కంటే బాగా పాపులర్ అయ్యింది.
అదే విధంగా బిగ్ బాస్ లో వివిధ సీజన్లలో పాల్గొన్న వారు కూడా చాలా మంది ఆ తరువాత తెరమరుగైపోవడం కూడా జరుగుతూనే ఉంది. అయితే వీరంతా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అభిమానులను, పాపులారిటీని తరువాత నిలబెట్టుకోవడంలో విఫలం అవుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…