Murali Mohan : చిరంజీవి విలన్ అవుతాడు అనుకున్నాం.. కానీ సినిమాలకే రంకు మొగుడయ్యాడు.. మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు..

Murali Mohan : సీనియర్ నటుడు మురళీమోహన్ ఒకప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండే వారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మన ఊరి పాండవులు మూవీని బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకట రమణ రచయితగా 1978లో తెరకెక్కించారు. ఇందులో కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, రావుగోపాలరావు ప్రధానపాత్రల్లో నటించారు. నాటి సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొంత విప్లవాత్మకంగా కథను తీర్చిదిద్దారు ముళ్ళపూడి వెంకట రమణ.

అయితే మన ఊరి పాండవుల సినిమా నిర్మాత జయకృష్ణ ఒకసారి ప్రాణం ఖరీదు మూవీ నిర్మాత గంగాధర్ ఆఫీసుకు వెళ్లారట. అక్కడ నటీనటుల ఆల్బమ్ చూస్తుండగా.. చిరంజీవి ఫోటో చూశారు. ఆయన ముఖంలో తేజస్సు, ఎర్రటి కళ్ళు జయకృష్ణకు బాగా నచ్చాయట. ఆ ఫోటో తీసుకువెళ్లి డైరెక్టర్ బాపుకు చూపించి.. మన చిత్రంలోని అర్జునుడిని పోలిన పాత్రకు బాగా సెట్ అవుతాడని చిరంజీవిని తీసుకుందామనుకున్నారట. అలా మన ఊరి పాండవులు చిత్రంలో హీరో, హీరోయిన్స్ ఉండరని పంచపాండవుల‌ లాంటి ఐదుగురు సినిమా నడిపిస్తారని.. అందులో మీది (చిరంజీవిది) ఒక పాత్ర అని చెప్పడంతో చిరంజీవి వెంటనే ఓకే అన్నార‌ట‌.

Murali Mohan

మన ఊరి పాండవులు చిరంజీవికి నటన పరంగా మూడో సినిమా కాగా, విడుదలపరంగా రెండవ సినిమా. ఈ సినిమా షూటింగ్ గోదావరి జిల్లాలో జరుగుతున్నప్పుడు ఒకసారి మురళీమోహన్, కృష్ణంరాజు కబుర్లు చెప్పుకుంటూ.. చిరంజీవి గురించి ప్రస్తావన వచ్చిందని, భవిష్యత్తులో చిరంజీవి విలన్ అవుతాడు అనుకున్నాం.. కానీ చిరంజీవి ఏకంగా సినిమాలకే రంకు మొగుడు అయ్యారంటూ.. మురళీమోహన్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చమత్కరించారు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రేక్షకులు కూడా మురళీమోహన్ మాటలు విని ఆశ్చర్యపోయారు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM