Tamannaah : చిత్ర పరిశ్రమకు తమన్నా వచ్చి దాదాపుగా 15 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ ఈ అమ్మడికి ఆఫర్లకు కొదువ ఉండడం లేదు. ఎప్పటికప్పుడు అన్ని భాషలకు చెందిన సినిమాల్లో ఆఫర్లను దక్కించుకుంటూ తన హవాను కొనసాగిస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని భాషలకు చెందిన చిత్ర పరిశ్రమల్లోనూ తమన్నా తన జోరు కొనసాగిస్తోంది. అయితే తమన్నా ఇటీవల కరోనా బారిన పడి కాస్త బరువు పెరిగింది. దీంతో ట్రోలర్స్ ఆమెపై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే వాస్తవానికి తమన్నా ఎల్లప్పుడూ ఫిట్‌గానే ఉంటుంది. వర్కవుట్స్ చేస్తుంటుంది. కానీ ట్రోలర్స్ వల్లనో ఏమో తెలియదు కానీ.. ఈమధ్య వర్కవుట్స్ బాగా చేస్తోంది.

ఇక లేటెస్ట్‌గా ఆమె మరోమారు ఫిట్‌నెస్ సెషన్‌లో పాల్గొంది. అందులో ఆమె కఠినమైన వ్యాయామాలను చేసింది. తన ట్రెయినర్ సహాయంతో ఆమె కసరత్తులు చేసింది. అదే సమయంలో తన వర్కవుట్స్‌ను వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఆ వీడియోతోపాటు తమన్నా ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండాలని.. అలా ఉండకపోయినా.. ఫిట్‌నెస్ సాధించకపోయినా కష్టమని.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని ఆమె కామెంట్స్ చేసింది. ఇక ఆమె వీడియో వైరల్ అవుతోంది.
https://twitter.com/tamannaahspeaks/status/1522520661591302145
కాగా తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె వెంకటేష్‌కు జోడీగా నటించిన ఎఫ్3 మూవీ త్వరలో విడుదల కానుంది. అలాగే చిరంజీవితో కలిసి భోళాశంకర్ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం అనే మూవీ చేస్తోంది. దీంతోపాటు బోలే చుడియన్, ప్లాన్ ఎ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్ అనే 3 హిందీ సినిమాల్లోనూ ఈమె నటిస్తూ బిజీగా ఉంది.