Balakrishna : నందమూరి బాలకృష్ణ.. ఈయన పేరు చెప్పగానే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. ఇక ఈయన సినిమా వచ్చిందంటే చాలు.. అభిమానులకు పండగే. ఆయన కొట్టినా.. తిట్టినా సరే.. ఆయనను అభిమానించే వారు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. అయితే బాలకృష్ణ బయటికి గంభీరంగా.. ఎక్కడ తిడతారో.. ఏం అంటారోనన్నంత కఠినంగా కనిపిస్తారు. కానీ వాస్తవానికి ఆయన మనస్సు వెన్నలాంటిది. ఆయన తన అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తారు. నిజానికి ఆయన గురించి చాలా మందికి తెలిసింది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఆయన మృదు స్వభావి. అభిమానులకు అండగా ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన మరోమారు ఓ అభిమాని పట్ల దాతృత్వం చూపించారు. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనిలో ఉన్న మందగ్రి గ్రామంలోని కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి బాలయ్య ఫ్యాన్. ఆయన అంటే ప్రాణం. ఆయన సినిమాలను చూస్తూ పెరిగాడు. అయితే ఎప్పటికైనా బాలకృష్ణను కలవాలని.. ఆయనతో ఒకసారి మాట్లాడాలని అతని కల. కానీ అది నెరవేరదేమోనని బెంగ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో కుమారుడి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు ఆదోని బాలకృష్ణ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ఎన్.సజ్జద్ హుస్సేన్‌ను కలిశారు. తమ కుమారున్ని కాపాడాలని కోరారు. దీంతో హుస్సేన్ వెంటనే బాలకృష్ణకు ఈ విషయం చేరవేశారు. అంతే.. వెంటనే బాలయ్య స్పందించి తన అభిమాని కాశీ విశ్వనాథ్ కు వీడియో కాల్ చేసి మాట్లాడారు.
తన అభిమానితో వీడియో కాల్‌లో మాట్లాడిన బాలయ్య అతని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అతనికి సహాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దీంతో కాశీ విశ్వనాథ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎట్టకేలకు తన కల నెరవేరిందని ఎంతో సంబరపడ్డాడు. ఇలా బాలకృష్ణ తన గొప్ప మనసును మరోమారు చాటుకున్నారు. గతంలోనూ ఆయన ఓ ప్రమాదంలో గాయపడి మంచం పాలైన మురుగేష్ అనే అభిమాని చికిత్సకు ఆర్థిక సహాయం అందించారు. ఇలా బాలకృష్ణ ఎప్పటికప్పుడు తన అభిమానులకు అండగా ఉంటూ వస్తున్నారు. అందుకనే ఆయన అంటే ఫ్యాన్స్‌కు అంత ఇష్టం, గౌరవం. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య చేసిన పనికి ఆయన ఫ్యాన్స్ అందరూ ఆయన్ను మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.