Samantha : సోషల్ మీడియాలో సమంత ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఓ వైపు సినిమాలు.. ఖాళీ సమయం లభిస్తే.. ఇంకో వైపు వెకేషన్లు.. ఇలా ఆమె కాలం గడుపుతోంది. ఈ మధ్యనే ఆమె నటించిన కణ్మణి రాంబో ఖతీజా (కాతు వాకుల రెండు కాదల్) అనే మూవీ విడుదలైంది. ఆమె బర్త్ డే రోజునే ఈ చిత్రం విడుదల కాగా చాలా మందికి ఈ సినిమా వచ్చినట్లే తెలియదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 80 శాతానికి పైగా థియేటర్లలో ఒక్క టిక్కెట్ కూడా బుక్ కాలేదు. కొన్నిథియేటర్లలో ప్రదర్శనను నిలిపివేశారు. దీంతో సమంత తొలిసారిగా తన సినిమాకు డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది.

అయితే ఈ మూవీ స్ట్రెయిట్ తెలుగు మూవీ కాదు. తమిళ వెర్షన్. కనుకనే ఆదరించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నటిస్తున్న శాకుంతలం, యశోద అనే సినిమాలపైనే ఇప్పుడు ఆమె ఆశలు పెట్టుకుంది. ఇక నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆమె అందాల ఆరబోత డోసును పెంచింది. ఈ మధ్య ఓ అవార్డ్స్ ఫంక్షన్‌లో ఎద అందాలు మొత్తం కనిపించేలా డ్రెస్ ధరించి అందరికీ షాకిచ్చింది. ఇక ఈమె గ్లామర్ షో చేయడం అసలు తగ్గడం లేదు.
ఇక తాజాగా సమంత ఓ మ్యాగజైన్ కు కవర్ పేజీ ఫొటోషూట్ చేసింది. అందులో గ్రీన్ కలర్ డ్రెస్ ధరించిన ఈ ముద్దు గుమ్మ ఎద అందాలను ఆరబోసింది. ఈ క్రమంలోనే సమంత లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక సమంత నటిస్తున్న యశోద సినిమాకు చెందిన గ్లింప్స్ తాజాగా విడుదల కాగా.. అది అందరినీ ఆకట్టుకుంటోంది. ఆగస్టులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.