Tamanna : మిల్కీ బ్యూటీ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు తమన్నా. ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 15 ఏళ్లకు పైనే అవుతోంది. మరోవైపు ఈమెకు ఏజ్ కూడా అయిపోతోంది. దీంతో ఆమెను అందరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు.. అని అడుగుతున్నారు. ఇక అందుకు ఈమె ఇటీవలే సమాధానం కూడా చెప్పింది. తాను ప్రస్తుతం సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నానని.. ఇంకో రెండేళ్ల పాటు సినిమాలు చేస్తానని.. ఆ తరువాతే పెళ్లి విషయం ఆలోచిస్తానని ఈమె క్లారిటీ ఇచ్చింది.

ఇక తమన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలను ఈమె షేర్ చేస్తుంటుంది. అందాలను ఆరబోస్తూ కనువిందు చేస్తుంటుంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు మతులు పోగొడుతున్నాయి.
బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన తమన్నా ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఆ ఫొటోల్లో తమన్నా మిల్కీ అందాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఇక తమన్నా ప్రస్తుతం పలు హిందీ సినిమాలతోపాటు తెలుగులో ఎఫ్3 మూవీ చేసింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఎఫ్2కు సీక్వెల్ గా దీన్ని నిర్మించారు. ఇందులో ఎఫ్2 తారాగణం దాదాపుగా మొత్తం ఉన్నారు. భార్యలు చేసిన అప్పులను తీర్చలేక భర్తలు ఎలా ఇబ్బందులు పడ్డారు ? అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ప్రేక్షకులకు ఎంతో వినోదం లభిస్తుందని అంటున్నారు.