Malavika Mohanan : బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. ఈ మధ్యే ఈ అమ్మడు తన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఓ ప్రముఖ మీడియా సంస్థ తన ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తుందని ఈమె తెలిపింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

అయితే సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ గ్లామర్‌ను ఒలకబోయడంలో మాత్రం హద్దులు లేవంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఈమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు హీట్‌ను పెంచుతున్నాయి.
మాళవిక మోహనన్ తాజాగా లైట్ పింక్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫొటోలను షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో ఆమె తన భారీ అందాలను ప్రదర్శిస్తుండడం షాక్ కు గురిచేస్తోంది.
ఈ అమ్మడు ఇప్పటికే పలు ఇతర భాషలకు చెందిన సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోగా.. తెలుగులో మాత్రం ఇంకా నటించలేదు. అయితే తాను చేసే గ్లామర్ షోకు ఏ రోజైనా సరే కచ్చితంగా ఈమెకు తెలుగులో ఆఫర్స్ వస్తాయని అంటున్నారు.