Malaika Aurora : బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తనకన్నా వయస్సులో ఎంత చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ఈ భామ రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం విదితమే. అయితే దీనిపై నెటిజన్లు ఎప్పటికప్పుడు ఆమెను విమర్శిస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఈమె అవేమీ పట్టించుకోదు. పైగా అర్జున్ కపూర్‌తో కలిసి వెకేషన్లకు వెళ్తూ రచ్చ చేస్తుంటుంది. అతనితో కలిసి దిగిన గ్లామర్ ఫొటోలను ఈమె షేర్ చేస్తుంటుంది.

ఇక తాజాగా మలైకా అరోరా షేర్ చేసిన ఫొటోలు మతులు పోగొడుతున్నాయి. ఆరెంజ్ కలర్ టాప్, బ్లాక్ కలర్ షార్ట్స్ ధరించి పూల్ దగ్గర ఈమె దిగిన ఫొటోలో ఈమె అందాలు ఒక రేంజ్‌లో వర్ణించనలవి కాకుండా ఉన్నాయి. ఫిట్‌నెస్ పరంగా ఎంతో శ్రద్ధ పెట్టే మలైకా అందాలను ఆరబోయడంలో అందరి కన్నా ఒక మెట్టుపైనే ఉంటుంది.
ఈ అమ్మడు రోజూ ఉదయాన్నే వాకింగ్‌కని తన కుక్కను తీసుకెళ్తుంటుంది. ఇక ఆ సమయంలోనూ ఈమె వెంట పడి ఫొటోలు తీస్తుంటారు. అసలు ఈ భామ ఎప్పుడు చూసినా అందాలను ఆరబోస్తూనే కనిపిస్తుంటుంది. మొన్నా మధ్య కోవిడ్ టీకా వేయించుకునే సమయంలోనూ ఎద అందాలను ప్రదర్శించింది. దీంతో నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇక ఈమె ప్రస్తుతం ఓ ఫిట్ నెస్ సంస్థతో కలిసి యోగా పాఠాలు నేర్పిస్తోంది. మరోవైపు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌తోనూ బిజీగా ఉంది.