Cloves : లవంగాలు రోజూ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Cloves : సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అటు మసాలా కూరలతో పాటుగా, మాంసాహార కూరల్లో, బిర్యానీ తయారీలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు వీటిని నార్మల్‌గా కూడా తింటారు. ఎందుకంటే లవంగం వంటల్లో రుచి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. లవంగాల్ని కూరలతో పాటు.. కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల్లో కూడా ఎక్కువగా వాడతారు. అయితే ఈ లవంగాల‌ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో చూద్దాం.

ఈ ల‌వంగాల‌ వల్ల మన పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. లవంగాల్ని పొడిగా చేసి.. దెబ్బతిన్న దంతం దగ్గర‌, పాడైన చిగుళ్ల దగ్గరా పెట్టుకుంటే.. మెల్లమెల్లగా అది మందులా పనిచేసి.. నొప్పిని తగ్గించేస్తుంది. నోరు బాగా దుర్వాస‌న వ‌స్తుంటే రెండు, మూడు ల‌వంగాల‌ను నోట్లో వేసుకుని న‌మిలితే నోటి దుర్వాస‌న వెంట‌నే త‌గ్గిపోతుంది. నోట్లో ఉండే బాక్టీరియా, క్రిములు న‌శిస్తాయి.

కొందరికి దూర ప్రయాణాలు చేయడం పడదు. ప్రయాణాల్లో మధ్యలోనే వాంతులు చేసుకుంటుంటారు. అలాంటి వారి సమస్యను కూడా లవంగాలతో చెక్ పెట్టొచ్చు. ప్రయాణానికి ముందు ఓ రెండు లవంగాలు తీసుకుంటే సరి. తిన్న ఆహారం జీర్ణం అవ్వడంతోపాటుగా.. వికారం లాంటివి పోతాయి. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతుంది.

క‌డుపులో బాగా వికారంగా అనిపించినా, తిన్న ఆహారం జీర్ణం కాక‌పోయినా.. రెండు, మూడు లవంగాల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి ఆ ర‌సాన్ని మింగితే ఫ‌లితం ఉంటుంది. రోజుకు నాలుగైదు ల‌వంగాల‌ను నోట్లో వేసుకుని తింటూ ఉంటే జ‌లుబు, ద‌గ్గు వంటివి వెంట‌నే త‌గ్గిపోతాయి. డ‌యాబెటిస్ ఉన్న వారు నిత్యం మూడు పూటలా ఒక ల‌వంగాన్ని తింటుంటే షుగ‌ర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల గ్యాస్ ట్ర‌బుల్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే మితంగా కాకుండా.. అదే పనిగా వీటిని తింటే ఇబ్బందులు తప్పవు. ఎక్కువగా తింటే నోరు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. రోజుకు నాలుగైదు కంటే మించకుండా తీసుకోవాలి. పిల్లలకు వీలైనంత తక్కువగా ఇస్తే మంచిది.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM