Priyanka Singh : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. బిగ్ బాస్ షోతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ప్రియాంక సింగ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం అందరికీ బిగ్ షాకింగ్ గా మారింది. తన కుటుంబానికి ఆధారంగా ఉండటంకోసం సాయి తేజ అనే అబ్బాయి ప్రియాంక సింగ్ అనే అమ్మాయిగా మారిపోయింది. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన ప్రియాంక బిగ్ బాస్ షో ద్వారా ఎంత మంచి పేరు సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ప్రియాంక సింగ్ బిగ్ బాస్ షోలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, తోటి కంటెస్టెంట్ మానస్ తో నడుచుకున్న విధానం, అందరితో స్నేహంగా ఉండే విధానం చాలామంది ప్రేక్షకులకు నచ్చింది. బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరువాత పలు ఈవెంట్స్, ఫోటోషూట్స్ తో ఫుల్ బిజీగా మారింది ప్రియాంక సింగ్. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన గ్లామర్ సీక్రెట్స్ ను తన అభిమానులతో పంచుకుంటోంది.
ఇటీవల ప్రియాంక సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో అందంగా పసుపు చీరలో రెడీ అయిన హల్దీ వేడుకకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను షేర్ చేసింది. దీంతో ప్రియాంక సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఇది ఫోటోషూట్ కోసమా.. లేక పెళ్లి కోసమా.. తెలియాలంటే ప్రియాంక సింగ్ నోరు విప్పి చెప్పాల్సిందే.
మరి వేరే వివాహ వేడుకలో ప్రియాంక చేసే హంగామానో తెలియదు కానీ, ఇప్పటివరకు ప్రియాంక సింగ్ తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి ఈ హంగామా అంతా తన యూట్యూబ్ ఛానెల్ కోసమో ఏమో వేచి చూడాలి. పసుపు రంగు చీరలో ప్రియాంక చేసిన పోస్ట్ మాత్రం అందరినీ ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…