T20 WC : ఇప్పటి వరకు క్రికెట్ అభిమానులు దుబాయ్‌లో ఐపీఎల్ 14వ ఎడిషన్‌ను ఎంజాయ్ చేశారు. రేపో మాపో ఫైనల్ కూడా జరగబోతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ముగిసిన వెంటనే పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది. అదే దుబాయ్ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఆడనున్న భారత జట్టు ధరించేబోయే నూతన జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోమ్లి, రవీంద్ర జడేజా, జస్‌ప్రిత్ బుమ్రాలు నూతన జెర్సీలను ధరించి సందడి చేశారు. ఈ ఫొటోను బీసీసీఐ ట్వీట్ ద్వారా పోస్ట్ చేసింది.
వంద కోట్ల మంది భారతీయులు, వారి చీర్స్, వారి ప్రేరణతోనే ఈ జెర్సీని రూపొందించామని బీసీసీఐ తెలియజేసింది. కాగా టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి, దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 24వ తేదీన జరగనుంది. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ ఆడే దేశాలన్నీ ఇప్పటికే దుబాయ్ చేరుకుని మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.