Prabhas : తమ అభిమాన హీరోలు పవర్ ఫుల్ పోలీస్ యూనిఫాంలో వెండితెరపై కనిపిస్తుంటే అభిమానులు పడే సంతోషం అంతా ఇంతా కాదు. చాలా మంది హీరోలు ఫ్లాప్‌ల దశలో ఉన్నా కూడా పోలీస్ యూనిఫాం వేసి సినిమాల్లో నటించి హిట్లు కొట్టారు. అనేక మంది హీరోలు పోలీస్ క్యారెక్టర్లలో ప్రేక్షకులను ఇప్పటికే మెప్పించారు. హీరోలు పోలీస్ క్యారెక్టర్ చేస్తే.. బొమ్మ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం కూడా ఉంటుంది. అయితే ప్రభాస్ కూడా తన 25వ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని.. జోరుగా చర్చ నడుస్తోంది.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న మూవీ టైటిల్‌ను ఇటీవలే అనౌన్స్ చేశారు. దానికి స్పిరిట్ అని టైటిల్ పెట్టారు. అయితే ఈ మూవీలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని టాక్. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు చెందిన పోలీస్ గెటప్ వేషాలను కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు.
అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావల్సి ఉంది. కాగా ప్రభాస్ ఇప్పటి వరకు ఫుల్ లెంగ్త్ మూవీలో పోలీస్ గా కనిపించలేదు. దీంతో స్పిరిట్ మూవీలో అభిమానులు ప్రభాస్ ఆ కోరిక తీరుస్తాడని తెలుస్తోంది. ఇక దీని గురించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.