Sri Reddy : సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయింది. అప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక సినిమాలకు సంబంధించిన ఏ విషయం గురించి అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ వివాదాలకు తెర లేపుతోంది. పవన్ కళ్యాణ్ గురించి ఈమె చేసే నెగిటివ్ కామెంట్లు పెద్దఎత్తున వివాదానికి దారి తీస్తుంటాయి.

ఇలా నిత్యం వార్తల్లో ఉండే శ్రీ రెడ్డి తాజాగా పల్లెటూరి రుచులతో సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తోంది. ప్రతిరోజు పీతలు, రొయ్యలు, చేపలు అంటూ ఏదో ఒక వంటకం ద్వారా అభిమానులను సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రీరెడ్డి చెరువులో చేపలు పడుతూ బంగారు తీగ చేపల పులుసు వండింది.
ఈ క్రమంలోనే ఈ చేపల పులుసు తయారుచేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా శ్రీరెడ్డి నాటు అందాలతో చెరువులో చేపలు పడుతూ పల్లెటూరు ఘుమఘుమలను తయారు చేస్తూ అభిమానులను సందడి చేస్తుందనే చెప్పాలి. ఈ విధంగా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా శ్రీరెడ్డి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన చేపల పులుసుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.