Anasuya : యాంకర్ అనసూయ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్‌గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వెండితెరపై కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ విధంగా బుల్లితెర వెండితెర పై ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ అభిమానుల సందడి చేస్తోంది.

ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా అనసూయ షేర్ చేసే ఫోటోలు వైరల్ అవడమే కాకుండా పలు వివాదాలకు కూడా కారణమవుతుంటాయి. ఇలా ఈమె ఫోటోలు పలు వివాదాలకు కారణం అయినప్పటికీ అనుసూయ చూసీచూడనట్టు వదిలేయకుండా అందుకు కారణమైన వారికి బాగా కౌంటర్ ఇస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా మరొక ఫోటోని షేర్ చేసింది.
ఈ క్రమంలోనే అనసూయ పిజ్జా తింటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పిజ్జా తింటున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఇవి వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై పలువురు నెటిజన్లు యథావిధిగా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ సినిమాల విషయానికి వస్తే కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతోపాటు పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.