Poonam Kaur : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్, నటి పూనమ్ మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ ఇండైరెక్ట్ గా వీరి గురించి వార్తలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

పూనమ్ కౌర్ నటించిన నాతిచరామి సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో నటి పూనమ్ ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి ముచ్చటించింది. పవన్ కళ్యాణ్ గురించి అడగడంతో ఈమె కాస్త ఎమోషనల్ గా ఫీల్ అయింది. పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడను.. ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది.. అంటూ చెప్పుకొచ్చింది.
మీరు పవన్ కళ్యాణ్ తో కలిసి నటించారు కదా.. అనే ప్రశ్న వేయగా.. నేను చేయలేదు, చాలామంది చెయ్యనివ్వలేదు.. అంటూ సమాధానం చెప్పింది. పవన్ కళ్యాణ్ గురించి తాను ఏం మాట్లాడినా అది నెగెటివ్ అవుతుందని, అది తప్పే అవుతుందని ఎమోషనల్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూనే.. అయ్యయ్యో నాకు సిగ్గు వచ్చేస్తుంది దేవుడా.. అంటూ ఫ్రీజ్ అయిపోయింది. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.