Sreemukhi : ఇటీవలే ముగిసిన వాలెంటైన్స్ డేను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఘనంగా జరుపుకున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రేమికుల దినోత్సవం రోజున ఎంజాయ్ చేశారు. జంటలుగా ఉన్నవారు ఒకరికొకరు ప్రేమ సందేశాలను పంపుకోగా.. జంటలుగా లేని వారికి తమ స్నేహితులు గ్రీటింగ్ కార్డులను పంపించారు. కాగా యాంకర్ శ్రీముఖికి కూడా అలాగే ఒకరు గ్రీటింగ్ కార్డును పంపించారు. అయితే ఆ పంపింది.. స్నేహితురాలా, స్నేహితుడా.. అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రేమికుల దినోత్సవం రోజున శ్రీముఖికి ఎవరో ఒక వ్యక్తి పుష్ప గుచ్ఛం పంపగా.. ఆ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది. పైగా ఆ పోస్ట్ కింద.. ఇది గుర్తు పెట్టుకోండి, మళ్లీ మాట్లాడుకుందాం, బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్.. అంటూ కామెంట్ పెట్టింది. అంటే శ్రీముఖి ఏ వ్యక్తితో అయినా లవ్‌లో ఉందా.. అందుకనే అతను ఆమెకు ఇలా గులాబీ పువ్వులను పంపించాడా.. అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక గతంలోనూ పలుమార్లు శ్రీముఖి ఇలాగే సస్పెన్స్‌తో కూడిన పోస్టులు పెట్టింది. దీంతో ఆమె ఎవరితోనో లవ్‌లో ఉందని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక తాజాగా శ్రీముఖి చేసిన పోస్టుతో మరోమారు ఈమె పెళ్లి విషయం తెరపైకి వచ్చింది. పైగా వాలెంటైన్స్ డే రోజు పువ్వులు కూడా వచ్చాయి. దీంతో కచ్చితంగా ఈమె లవ్‌లో ఉందని అంటున్నారు. మరి శ్రీముఖి నిజంగానే లవ్‌లో పడిందా.. త్వరలోనే పెళ్లి చేసుకోనుందా.. అనే విషయాలు తెలియాలంటే.. ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.