Ram Gopal Varma : వివాదాలకు మారుపేరుగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ కామెంట్స్ చేసినా సరే.. అవి వైరల్ అవుతుంటాయి. అందరూ చర్చించుకునే విధంగా ఆయన కామెంట్స్ చేస్తుంటారు. హీరోయిన్లు, నటులు, మోడల్స్.. ఇలా ఎవరైనా సరే.. వర్మ కళ్లకు కాస్త అందంగా కనబడితే చాలు, వారిపై కామెంట్లు చేయకుండా ఉండలేరు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా యాంకర్ శ్యామలపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

ఓ సినిమాకు సంబంధించి నిర్వహించిన వేడుకలో యాంకర్ శ్యామల హోస్ట్‌గా మాట్లాడుతోంది. అయితే అదే సమయంలో స్టేజీ మీద ఉన్న వర్మ శ్యామల గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంత అందమైన యాంకర్ శ్యామల నా కళ్ల నుండి ఎలా తప్పించుకుంది.. అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
ఇక ఆ మధ్య వర్మ.. అషురెడ్డి, అరియానా వంటి బిగ్ బాస్ స్టార్స్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రామ్ ల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. మరి రానున్న రోజుల్లో వర్మ తాను వ్యాఖ్యలు చేసిన అందరికీ ఏమైనా సినిమా చాన్స్‌లు ఇస్తారో, లేదో.. చూడాలి.