Puneeth Rajkumar : పునీత్ బ‌దులు నేను చచ్చిపోయినా బాగుండేది.. సీనియర్ స్టార్ ఎమోష‌న‌ల్‌..

Puneeth Rajkumar : క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం ఇంకా క‌ల‌గానే ఉంది. ఆయన లేర‌నే విష‌యాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు పునీత్. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయ‌న మరణించి 20 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయనని మరిచిపోలేకపోతున్నారు కన్నడిగులు.

తాజాగా సంస్మరణ సభ నిర్వ‌హించ‌గా.. ఈ కార్య‌క్ర‌మానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప సహా ఎంతో మంది రాజకీయ నాయకులు పునీత్ సంస్మరణ సభలో కనిపించారు. సినీ ఇండస్ట్రీ అంతా ఈ సభలో ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచు మనోజ్ ఒక్కడే కనిపించాడు. తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ వేదిక‌పై చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడాడు.

2017లో వ‌చ్చిన రాజకుమార సినిమాలో పునీత్ రాజ్‌కుమార్ తండ్రిగా నటించాడు శరత్ కుమార్. సంతోష్ ఆనందనం తెరకెక్కించిన ఆ చిత్రం రూ.75 కోట్లు వసూలు చేసి కన్నడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్‌లోనూ నటిస్తున్నాడు శరత్ కుమార్. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. ఆయన బదులు తాను చనిపోయినా బాగుండేది అంటూ ఎమోషనల్ అయ్యాడు శరత్ కుమార్.

పునీత్ నా శ్రద్ధాంజలికి వస్తాడనుకున్నా.. ఎందుకంటే నాకు 67 ఏళ్లు.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది.. అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ దేవుడు పునీత్ రాజ్‌కుమార్ బదులు తనను తీసుకెళ్లినా బాగుండు అంటూ స్టేజిపైనే ఏడ్చేశాడు శరత్‌ కుమార్‌. ఈయ‌న మాట‌లు పునీత్ సంస్మరణ సభలో చాలా మంది కంట క‌న్నీరు పెట్టించాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM