Chiranjeevi Godfather : 1990లలో ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసిన చిరంజీవి మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. ఖైదీ నం.150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పుడు కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేసిన చిరు, ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు.
ప్రస్తుతం ’గాడ్ ఫాదర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ‘గాడ్ ఫాదర్’ మూవీని ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తున్నారు. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరంజీవి సరసన ‘అల్లుడా మజాకా’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘ఇద్దరు మిత్రులు’ తదితర చిత్రాలలో కథానాయికగా నటించిన రమ్యకృష్ణ ఇప్పుడు ఆయనకు చెల్లెలుగా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో చిరు చెల్లెలు పాత్రకు ప్రాధాన్యం ఉంది.
ఆ పాత్ర కోసం రమ్యకృష్ణని ఎంచుకున్నారని సమాచారం. రమ్య కూడా ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…