Aryan Khan : డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) చేత అరెస్టు కాబడి ఆ తరువాత 20 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు అక్టోబర్ 29వ తేదీన బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఎంతో మంది సీనియర్ లాయర్లు కేసును వాదించినప్పటికీ బెయిల్ తేలేకపోయారు. దీంతో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కేవలం 2 రోజుల్లోనే ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వచ్చేలా చేశారు.
అయితే జైలు నుంచి విడుదల అయ్యాక ఆర్యన్ ఖాన్ పట్ల షారూఖ్ ఖాన్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. తన పర్సనల్ బాడీ గార్డ్ రవి సింగ్‌ను ఆర్యన్ ఖాన్‌కు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే షారూఖ్ తన కోసం ఇంకో కొత్త బాడీ గార్డ్‌ను నియమించుకునే పనిలో ఉన్నాడు.
ఇక ఆర్యన్ ఖాన్ వల్ల ఇప్పటికే చాలా రోజుల నుంచి షారూఖ్ తాను చేస్తున్న సినిమాల షూటింగ్‌కు వెళ్లడం లేదు. దీంతో ఎంతో షెడ్యూల్ వెనుకబడింది. అయితే ఆర్యన్ ఖాన్‌తో షారూఖ్ మరికొన్ని రోజులు ఇంట్లోనే గడపనున్నారు. ఈ క్రమంలోనే తాను చేస్తున్న సినిమాల షెడ్యూల్‌ను కొద్దిగా మార్చమని షారూఖ్ చిత్ర యూనిట్లను కోరారు.
తనకు సంబంధం లేని సీన్లను చిత్రీకరించేటప్పుడు తన అవసరం ఉండదు కనుక ఆ సమయంలో కచ్చితంగా ఆర్యన్‌తో ఉండాలని షారూఖ్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సీన్ల చిత్రీకరణ అందుకు తగిన విధంగా మార్చాలని కోరాడట. దీంతో ఎక్కువ సమయం పాటు ఫ్యామిలీతో.. ముఖ్యంగా ఆర్యన్‌తో గడిపే సమయం లభిస్తుంది.
ఇక షారూఖ్ సినిమాల విషయానికి వస్తే.. దీపికా పదుకునే, జాన్ అబ్రహామ్‌లతో కలిసి పఠాన్ అనే సినిమాలో షారూఖ్ నటిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…