Samantha Naga Chaithanay : ప్రస్తుతం సమంత నాగచైతన్య విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజుల నుంచి సమంత చైతు విడాకులు తీసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలు నిజం కాకూడదని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే అభిమానులకు చేదు వార్తని చెబుతూ నాగచైతన్య ఎట్టకేలకు వారి వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలియజేశారు. ఈ వార్త అభిమానులకు కాస్త భారంగానే అనిపిస్తోంది.
అయితే సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోవడానికి కారణం అతని లవ్ స్టోరీ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత సమంత ఎక్కువగా గ్లామర్ సినిమాలు చేస్తూ బోల్డ్ పాత్రలో నటించడం వల్ల అక్కినేని కుటుంబానికి, సమంతకు మధ్య మనస్పర్థలు వచ్చాయని అందుకోసమే విడిపోతున్నారు.. అంటూ వార్తలు వచ్చాయి.
సమంత డబ్బు కోసం స్కిన్ షో చేస్తుందని, తనని సినిమాలు ఆపమని చెప్పినప్పటికీ వినకుండా సినిమాలు చేయడం వల్లే అసలు గొడవలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చైతన్య.. సాయి పల్లవితో ప్రేమలో పడ్డాడని తెలుస్తోంది. సాయి పల్లవి స్కిన్ షోలకు, గ్లామర్‌కు దూరం. ఇప్పటికే ఆ విషయాన్ని ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో చైతన్య.. సాయి పల్లవి ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే సమంత.. చైతుతో విడాకులు తీసుకుంటున్నట్లు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ విషయం నిజం అవుతుందో, కాదో చూడాలి..!