Samantha : కరోనా కారణం వల్ల ఎన్నో సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదలవుతున్నాయి. ఇలా ఎన్నో సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదలయ్యి అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ కోవలోనే సమంత నటిస్తున్న కొత్త సినిమా థియేటర్ లో కాకుండా డైరెక్టుగా ఓటీటీలో విడుదల కాబోతోందని తెలుస్తోంది.
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార సమంత కలిసి నటిస్తున్న “కాతు వాకుల రెండు కాదల్” అనే చిత్రాన్ని దీపావళి కానుకగా థియేటర్లలో కాకుండా ,ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి హాట్ స్టార్ తో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
https://twitter.com/OTTPlatform/status/1443588381447913484
ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా దీపావళి కానుకగా హాట్ స్టార్ లోనే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేయనున్నారు. ఇకపోతే సమంత గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రంగా తెరకెక్కుతున్న శాకుంతలం అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.