Samantha Naga Chaithanya : సమంత నాగచైతన్యల గురించి గత కొద్దిరోజుల నుంచి విడాకుల విషయంలో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరు విడాకులు తీసుకొని విడిపోతారని జ్యోతిష్యుడు వేణు స్వామి గత మూడు సంవత్సరాల క్రితం తెలియజేశారు. అయితే తాజాగా ఈ వీడియో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే కొందరు అభిమానులు అప్పుడు ఈ జ్యోతిష్యుడి మాటలను కొట్టిపారేశారు.
తాజాగా వీరి వివాహ బంధం బ్రేక్ చేసుకుంటూ విడాకులు తీసుకోబోతున్నామని నాగచైతన్య అధికారకంగా ప్రకటించడంతో వీరి విషయంలో జ్యోతిష్యుడు వేణుస్వామి మాటలు నిజమయ్యాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత గురించి జ్యోతిష్యుడు మాట్లాడుతూ.. సమంత అమావాస్య రోజున పుట్టింది కనుక తన వైవాహిక జీవితంలో మనస్పర్థల కారణంగా విడిపోతుందని గతంలో చెప్పారు.
కెరియర్ పరంగా ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో మాత్రం మనస్పర్థల కారణంగా విడి పోతారని చెప్పడంతో గతంలో ఈ మాటలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆ జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారమే సమంత నాగ చైతన్య మనస్పర్థల కారణంగా విడిపోవడంతో జ్యోతిష్యుడు వేణుస్వామి మాటల నిజమయ్యాయని ప్రస్తుతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.