Kajal Aggarwal : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెత అందరికీ తెలిసిందే. పక్క వాడు అన్ని విధాలుగా మంచిగా ఉంటే.. మనం లేకపోతే.. అతన్ని చూపిస్తూ మనల్ని తిడతారు. ఇది సహజంగానే చాలా ఇండ్లలోనూ జరుగుతుంటుంది. అయితే సమంత కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే కాజల్ అగర్వాల్ తల్లి అయింది కదా.. కనుక ఈ సాకుతో సమంతను మరోసారి విమర్శిస్తున్నారు. ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును 2020లో పెళ్లి చేసుకుని 2 ఏళ్లలో బాబుకు జన్మనిచ్చింది కూడా. ఆమె తన భర్త తరఫు వారి సంప్రదాయాలను పాటిస్తుందని ఆమె పోస్టులను చూస్తే అర్థమవుతుంది. అయితే ఇవే విషయాలను సాకుగా చూపిస్తూ నెటిజన్లు సమంతపై సెటైర్లు వేస్తున్నారు. సమంత ఎప్పుడో 2017లో నాగ చైతన్యను వివాహం చేసుకుంటే.. ఇన్నేళ్ల నుంచి పిల్లల్ని ఎందుకు కనలేదని.. ఆమెకు డబ్బు యావ ఎక్కువని.. ఆమెకు సినిమాలే ప్రపంచమని తిడుతున్నారు. కాజల్ అగర్వాల్ ఎంత బుద్ధిగా ఉందో చూడు.. అంటూ సమంతపై దుమ్మెత్తి పోస్తున్నారు.
వాస్తవానికి సమంత వివాహం అయ్యాక కూడా.. గ్లామర్ షోను తగ్గించలేదు సరికదా.. కాస్త పెంచింది. అదే ఆమెకు ఇబ్బందులు తెచ్చి పెట్టిందని ఇప్పటికీ టాక్ నడుస్తోంది. ఇక ఆమె నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి నెటిజన్లు ఆమెను ఏదో ఒక విధంగా విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న గ్లామర్ షోకు మళ్లీ ఆమెపై కామెంట్ల వర్షం కురిపించడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ప్రమేయం లేకపోయినా.. కాజల్ అగర్వాల్ తల్లి అవడంతో ఆమెను చూపిస్తూ.. బుద్ధి తెచ్చుకోవాలని సమంతకు హితవు పలుకుతున్నారు. మరి ఇందుకు ఆమె ఏమని రిప్లై ఇస్తుందో చూడాలి.