Anasuya : ఓ వైపు బుల్లితెరపై ఎంతో సందడి చేస్తున్న అనసూయ మరోవైపు వెండితెరపై కూడా దూసుకుపోతోంది. వరుస సినిమా ఆఫర్లతో ఈ రంగమ్మత్త చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఈమె నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో అర డజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ అనసూయ బుల్లితెరను విడిచిపెట్టడం లేదు. టీవీ షోలు, ఈవెంట్‌లు, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఇక పుష్ప సినిమాతో దాక్షాయణిగా పలకరించిన ఈమె మరోమారు పుష్ప 2 లో అలరించేందుకు సిద్ధమవుతోంది.

అనసూయ ఈ మధ్యే నటించిన ఖిలాడి మూవీ అంతగా విజయం సాధించలేదు. అయినప్పటికీ ఈమెకు అందులో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర లభించింది. ఇక పుష్ప 2 లోనూ ఈమె పాత్ర వ్యవధి కాస్త ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. పుష్ప మొదటి భాగంలో మాత్రం ఈమె చాలా తక్కువ సమయం పాటు తెరపై కనిపించింది. ఈ క్రమంలోనే పుష్ప 2లో ఈమె పాత్ర ఎక్కువ సేపు కనిపిస్తుందని అంటున్నారు. ఇక తెలుగుతోపాటు తమిళం, మళయాళం భాషలకు చెందిన చిత్రాలతోనూ అనసూయ ఎంతో బిజీగా ఉంది.
View this post on Instagram
అయితే జబర్దస్త్ షోలో అనసూయ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈమె షో ఆరంభంలో చేసే డ్యాన్స్‌కు ఫిదా అయిపోతుంటారు. అందులో భాగంగానే ఈమె చేసిన డ్యాన్స్ తాలూకు ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అనసూయ డ్యాన్స్‌ను చూసి మైమరిచిపోతున్నారు. ఇక అనసూయ ఈమధ్య ఒకటి రెండు సార్లు వివాదాల్లోనూ చిక్కుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే ఆ తరువాత అంతా సద్దుమణిగింది.