Rashmika Mandanna : దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటి రష్మిక మందన్నకు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. రష్మికకు సౌత్‌లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈ అమ్మడు తనకు ఎలాంటి సినిమాలో అవకాశం వచ్చినా వదలకుండా చేస్తోంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అందంతో ఈమె ఎల్లప్పుడూ అభిమానులను అలరిస్తుంటుంది. ఇక డ్యాన్స్ పరంగా రష్మిక పేరు పెట్టాల్సిన పనే లేదు. అంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. పుష్ప మూవీలో సామి సాంగ్‌కు ఈమె చేసిన డ్యాన్స్.. అద్భుతమనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ పాటకు చేసిన డ్యాన్స్‌తో ఎంతో మందిని ఈమె ఆకట్టుకుంది.

కాగా రష్మిక మందన్న తన అందాన్నే కాదు.. శరీరాన్ని కాపాడుకోవడంలోనూ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ఫిట్‌నెస్ విషయంలో ఈమె చాలా శ్రద్ధ వహిస్తుంది. రోజూ జిమ్ చేస్తుంటుంది. షూటింగ్ నుంచి కాస్త విరామం లభిస్తే చాలు.. ఫిట్ నెస్‌పై దృష్టి పెడుతుంది. ఇక ఆమె తాజాగా తన ఫిట్‌నెస్ కోచ్ కరణ్ సాహ్‌నీతో కలిసి పలు ఎక్సర్‌సైజ్‌లు చేసింది. కాళ్లు, పొట్టకు సంబంధించిన కోర్ బిల్డింగ్ ఎక్సర్‌సైజ్‌లను ఆమె చేసింది. ఈ క్రమంలోనే ఆమె వర్కవుట్స్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె హిందీ సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటోంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను అనే మూవీలో ఈమె సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న గుడ్ బై అనే మూవీలోనూ రష్మిక నటిస్తోంది. కాగా అల్లు అర్జున్ లీడ్ రోల్‌లో త్వరలో ప్రారంభం కానున్న పుష్ప 2 షూటింగ్ లోనూ ఈమె త్వరలో పాల్గొననుంది. దీంతోపాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ స్టార్ నటుడు విజయ్ తెలుగు సినిమాలోనూ నటించే అవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకుంది. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇలా పలు వరుస సినిమాలతో రష్మిక ప్రస్తుతం ఎంతో బిజీగా ఉందని చెప్పవచ్చు.