Samantha : ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే దుష్యంతుడు, శకుంతల ప్రేమ కథ ఆధారంగా సమంత శకుంతల పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ముందుగా ఎన్టీఆర్, బాలకృష్ణ ఇదే కథాంశంతో రెండు సినిమాలను తెరకెక్కించారు.

మొదటిది ఎన్టీఆర్, బి.సరోజా దేవి హీరో, హీరోయిన్లుగా ‘శకుంతల’ పేరుతో కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఎన్టీఆర్ స్వీయదర్శకత్వంలోనే ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ దుష్యంతుడిగా నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇక తాజాగా దుష్యంతుడు, శకుంతల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా తెరకెక్కుతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని బాలకృష్ణ పొందలేని విజయాన్ని సమంత పొందుతుందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.