Redmi 9a 9i Sport : మొబైల్స్ తయారీదారు షియోమీకి చెందిన రెడ్‌మీ సబ్‌బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేశారు. ఈ ఫోన్ రెండు వేరియెంట్లలో లాంచ్ అయింది. రెడ్‌మీ 9ఎ స్పోర్ట్, రెడ్‌మీ 9ఐ స్పోర్ట్ పేరిట రెండు ఫోన్లను విడుదల చేశారు. ఈ ఫోన్లలో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

రెడ్‌మీ 9ఎ స్పోర్ట్ ఫోన్‌లో.. 6.53 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెసర్ లభిస్తుంది. 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.. వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
ఇక రెడ్‌మీ 9ఐ స్పోర్ట్ ఫోన్‌లో.. 4జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లను అందిస్తున్నారు. మిగిలిన ఫీచర్లు అన్నీ పై ఫోన్‌లోవే ఉన్నాయి.
రెడ్‌మీ 9ఎ స్పోర్ట్ ఫోన్‌కు చెందిన 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8799 ఉండగా, 128 జీబీ మోడల్ ధర రూ.9299గా ఉంది. అదేవిధంగా రెడ్‌మీ 9ఐ స్పోర్ట్‌కు చెందిన 2జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.6,999గా ఉంది. 3జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.7,999గా ఉంది. ఈ ఫోన్లను అన్ని ఈ-కామర్స్ సైట్లతోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.