Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి నెలకొన్న అయోమయ పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 10వ తేదీన సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన సాయి తేజ్ ఇప్పటివరకు కోమాలోనే ఉన్నాడని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రిపబ్లిక్ సినిమా వేడుకలో తెలియజేయడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే సాయి తేజ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల గురించి మెగాస్టార్ స్పందించారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా సాయి ధరమ్ కోలుకుంటున్నాడు.. అతనికి మీ ఆశీస్సులు కావాలి.. రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందించాలని ఆశిస్తున్నాను. రిపబ్లిక్ సినిమా చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కుదేలైన సినీ ఎగ్జిబిషన్ సెక్టార్‌కు రిపబ్లిక్ చిత్ర విజయం కోలుకోవడానికి కావాల్సినంత ధైర్యం ఇస్తుందని ఆశిస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశారు.
Best Of Luck Team #Republic @IamSaiDharamTej pic.twitter.com/hyZJYy9AfI
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 30, 2021
ఈ క్రమంలోనే సాయితేజ్ ఆరోగ్య విషయంపై సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ మాట్లాడుతూ.. త్వరలోనే నా స్నేహితుడిని కలవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ.. తమన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్, తమన్ ఇద్దరూ అతని ఆరోగ్యంపై స్పందించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.