Sajjanar : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఎంతో చురుగ్గా వ్యవహరిస్తూ ఆర్‌టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. వీలు కుదిరినప్పుడల్లా ఆయనే స్వయంగా ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. ప్రచారం కల్పిస్తున్నారు.
ఇక మొన్నీ మధ్యే అల్లు అర్జున్ నటించిన ఓ ట్యాక్సీ కంపెనీకి చెందిన యాడ్ ఆర్‌టీసీని కించ పరిచేలా ఉందంటూ ఆ సంస్థకు, అల్లు అర్జున్‌కు లీగల్ నోటీసులను పంపారు. దీంతో వారు క్షమాపణలు చెప్పి ఆ యాడ్‌ను తొలగించారు.
బస్సు ఆగిన చోటే ఎక్క వలెను. కదిలే బస్సు ఎక్కకూడదు.@TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @NameisNani@Sai_Pallavi92 @baraju_SuperHit @MilagroMovies @NtvTeluguLive @abntelugutv @Gopimohan @DDYadagiri @dpveu_official @iamKavithaRao @HiHyderabad @TV9Telugu @10TvTeluguNews pic.twitter.com/CTHk2bpXuJ
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 25, 2022
కాగా సజ్జనార్ తాజాగా మరోమారు ఓ సినిమాలోని సీన్‌ను షేర్ చేసి ఆకట్టుకున్నారు. హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవి నటించిన ఎంసీఏ చిత్రంలోని సీన్‌ను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో సాయిపల్లవి రన్నింగ్‌లో ఉన్న బస్సు ఎక్కుతుంటుంది. ఆ సీన్‌ను షేర్ చేస్తూ ఆయన.. బస్సు ఆగిన తరువాతే ఎక్కాలి, రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఎక్కకూడదు.. అంటూ సందేశం ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.