Viral Video : పెళ్లిళ్ల సమయంలో అప్పుడప్పుడు కొన్ని వింతైన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి సంఘటనలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అవి కాస్తా వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ వింతైన సంఘటన వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందంటే..
పెళ్లి సందర్భంగా వేదికపై నిలబడ్డ వధూవరులు దండలు మార్చుకుంటున్నారు. అయితే వధువు మెడలో వరుడు పూలమాల వేయబోగా.. వధువు వద్దన్నట్లుగా వెనక్కి వంగింది. ఆమె వంగిన భంగిమను చూస్తే ఆమె జిమ్నాస్టిక్స్ చేసినట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram
ఫుట్‌బాల్ ప్లేయర్ వంగినట్లు వధువు ఎలా వంగిందో చూడండి.. అంటూ కొందరు కామెంట్లు చేయగా.. మార్షల్ ఆర్ట్స్ చదివినట్లుంది, అందుకనే పెళ్లి సమయంలోనే వరున్ని ఆట ఆడిస్తుంది.. అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. ఇక ఈ వీడియోను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.