Sada : తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సదా. జయం సినిమాలో ఎంతో పద్ధతిగా లంగా వోణీలు వేసుకుని ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇలా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సదా అనంతరం వరుస చిత్రాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఒకానొక సమయంలో తెలుగు, తమిళ భాషలలో ఎంతో బిజీగా ఉండిపోయింది.

ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం కొనసాగలేరనే విషయం మనకు తెలిసిందే. సదాతోపాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారందరూ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయి రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైనా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసింది. అయితే ప్రస్తుతం తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఈ ముద్దుగుమ్మ తెగ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే అవకాశాల కోసం గ్లామరస్ ఫోటో షూట్లతో గాలం వేస్తోంది. సోషల్ మీడియా వేదికగా పొట్టి దుస్తులను ధరిస్తూ గ్లామర్ షో చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ అవకాశాలు దక్కించుకునే పనిలో పడింది. ఈ అవకాశాల కోసం ఇలా షో చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ అవకాశాలు వచ్చినా అక్క, వదిన పాత్రలలో అవకాశాలు వస్తాయనే చెప్పాలి.