Bheemla Nayak : ప్రస్తుత తరుణంలో చిన్న హీరోల సినిమాలే కాదు.. పెద్ద హీరోల సినిమాలు కూడా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులకు కావల్సింత వినోదం లభిస్తోంది. థియేటర్లలో సినిమా చూడకుండా మిస్ అయిన వారు.. చూడలేని వారు.. ఓటీటీల్లో కొత్త సినిమాలను చూస్తున్నారు. అలాగే థియేటర్లలో చూసిన వారు కూడా ఓటీటీల్లో ఇంకోసారి సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే కోవలో ప్రేక్షకులను మరోమారు అలరించేందుకు భీమ్లా నాయక్ సిద్ధమవుతోంది. ఈ మూవీని త్వరలో ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నారు.

భీమ్లా నాయక్ చిత్రానికి సంబంధించి డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌తో పాటు.. ఆహా వీడియో సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ రెండు సంస్థలు తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్ ఇచ్చాయి. ఈ నెల 25వ తేదీన ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నామని ఈ రెండు సంస్థలు ఒకేసారి ప్రకటించాయి. వచ్చే శుక్రవారం ఇదే రోజున మీ ఇంట్లో పవర్ స్టార్ తుఫాన్ వస్తుందని.. సిద్ధంగా ఉండడని.. తేదీని గుర్తు పెట్టుకోండి.. అంటూ ఆయా సంస్థలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. దీంతో మార్చి 25వ తేదీన భీమ్లా నాయక్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయింది.
ఇక ఈ మూవీలో పవన్, రానాలు కీలకపాత్రల్లో నటించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్‌లు వారి పక్కన హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని తెరకెక్కించింది.